తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. సాగర్ నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 346 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. త్రిపురారం, గుర్రంపోడు మండలంలో వట్టికోడు, నాగార్జునసాగర్ హిల్ కాలనీలో పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
అటు ఏపీలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి.. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటలోని పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏర్పేడు మండలం మన్నసముద్రంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా తిరుపతి ఉపఎన్నికలో మొత్తం 17,11,195 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. ‘నో యువర్ పోలింగ్ స్టేషన్’ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకోవచ్చు.