ఎగువన ఉన్న శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో… నాగార్జున సాగర్ కు మళ్ళీ వరద పోటెత్తింది. దాంతో సాగర్ నిండు కుండ లా మారింది. దాంతో సాగర్ ప్రాజెక్ట్ 10 క్రస్టు గేట్ల ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ జలాశయానికి 1,27,316 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో ఉండగా ప్రాజెక్ట్ 10 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి అవుట్ ఫ్లో గా 1,33,137 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా… ప్రస్తుతం 589.80 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 ఉండగా… సాగర్ లో ప్రస్తుతం 311.4474 టీఎంసీలు నీరు ఉంది.
ఇది కూడా చదవండి: తెలంగాణ విమోచన దినోత్సవ సభః నిర్మల్ కు అమిత్ షా