Wednesday, October 23, 2024

TG | నాగార్జున ప‌రువు న‌ష్టం కేసు… విచారణ వాయిదా

మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సినీనటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావాపై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ కొనసాగింది. మంత్రి కొండా సురేఖ తరపున అడ్వకేట్ గుర్మీత్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 30కి వాయిదా వేసింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

ఈక్రమంలో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరో వైపు సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విషయమై నాంపల్లి న్యాయస్థానం ముందు ఆయన హాజరు కానున్నారు. ఆయన స్టేట్‌మెంట్‌ ఇవ్వనున్నారు. మేజిస్ట్రేట్ రికార్డ్ చేయనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement