Thursday, November 7, 2024

కాంగ్రెస్‌పై నాగం జనార్ధన్ రెడ్డి ఫైర్.. డబ్బునోళ్లకే టికెట్లు, అందుకే బీఆర్ఎస్‌లోకి-

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఒకేరోజు ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక‌, ఇప్పటికే ఎర్ర శేఖర్ బీఆర్ఎస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డిని మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు కలిశారు. హైదరాబాద్‌లోని నాగం నివాసంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఇక, రేపు (అక్టోబర్ 30) ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో నాగం బీఆర్ఎస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి భంగపడ్డారు నాగం జనార్ధన్ రెడ్డి. దీంతో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పెద్దలు ఠాక్రే, జానారెడ్డి చర్చలు జరిపినా నాగం జనార్ధన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాగం జనార్ధన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. ‘కాంగ్రెస్ పార్టీ అద్వానమైన స్థితికి వచ్చింది. చేవెళ్లలో దళిత ఆత్మగౌరవ సభకు 50వేల మందిని తరలించాము. పొద్దున జాయిన్ అయిన వాడికి టికెట్ కేటాయించారు. ఉదయపూర్ డిక్లరేషన్ తుంగలో తొక్కారు. నాకు టికెట్ ఎందుకు రాలేదో రేవంత్ రెడ్డిని అడిగా. సునీల్ కనుగోలు టీం సర్వే ఆధారంగా టికెట్ ఇచ్చామని చెబుతున్నారు. మొదటి నుండి జెండా పట్టుకుని పని చేసిన వాడికి టికెట్ ఇవ్వకుండా, డబ్బు ఉన్నోడికి అవతల పార్టీలో ఉన్నోడికి టికెట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కార్యకర్తల ముందుకు వచ్చాను. నాగర్ కర్నూల్ భవిష్యత్ కోసం బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నా’ అని నాగం తెలిపారు.

- Advertisement -

నాగంతో కలిసి పని చేయడానికి సిద్ధం – మర్రి జనార్ధన్ రెడ్డి

మనం కలిసి పని చేసి నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ జెండా ఎగరేద్దాం. సీనియర్ నాయకులు నాగం జనార్ధన్ రెడ్డిని అవమానించారు. వారి నాయకత్వంలో పని చెయ్యడానికి నేను సిద్ధం. నా విజయం కోసం వారు నాతో కలిసి ఉంటారు. వారికి తగిన గౌరవం ఇస్తాను. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి నాగం. నాగం జనార్ధన్ రెడ్డికి తమ్ముడిలాంటోడిని. కొడుకు లాంటోడిని. ఆయన అడుగుజాడల్లో పని చేస్తాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement