హీరో నాగచైతన్య కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ‘మానాడు’ ఫేం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ద్విభాష చిత్రాన్ని చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రామాలను జరుపుకుంది. లాంఛనింగ్ కార్యక్రమానికి నటులు రానా దగ్గుబాటి, శివ కార్తికేయన్, దర్శకులు భారతిరాజా, బోయపాటి శ్రీను గెస్ట్లుగా వచ్చారు. రానా కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. బోయపాటి క్లాప్ కొట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం సమకూర్చుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement