హీరో నాగచైతన్య తన చిన్ననాటి ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఆయన నటించిన థ్యాంక్యూ ప్రమోట్ చేయడానికి సరైన దారినే ఎంచుకున్నారు. తనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో గడిపిన కొన్ని అమూల్య క్షణాలను షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో తల్లి లక్ష్మి తనను ఎత్తుకొని ముద్దాడుతున్నఅందమైన చిన్ననాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేశారు. దాంతో పాటు నాన్న నాగార్జునతో ఒక చిన్న గోడ మూడ కూర్చొని పెప్సీ తాగుతున్న ఫొటోను పంచుకున్నారు. చివరగా తన పెట్ డాగ్‌తో ఉన్న రీసెంట్ ఫొటోను కూడా అతను షేర్ చేశారు. ఈ మూడు ఫొటోలకు “#themagicwordisthankyou థాంక్ యూ – తరచుగా నేను వాడే పదం. కానీ చాలా ముఖ్యమైన సందర్భానికి అది సరిపోదు. ఈ ఆలోచనను నా నెక్ట్స్ మూవీ ‘థాంక్ యూ’ రిఫ్లెక్ట్ చేస్తుంది.. ఈ సినిమా ప్రయాణంలో నన్ను కదిలిందని పోస్ట్ చేశారు.. జూలై 22న #thankyouthemovie రిలీజవుతుందన్నారు. అనేకమంది అతని పోస్ట్‌ను లైక్ చేయగా, నటి శోభితా ధూళిపాళ కూడా హార్ట్ ఎమోజీని జోడించి, అతని ఇన్‌స్టా పోస్ట్‌ను లైక్ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement