నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్‌స్టోరీ మూవీ ఈనెల 24న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 900 థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుంది. నాగచైతన్య గత సినిమాలతో పోలిస్తే ఈ మూవీ భారీ బిజినెస్ చేసింది. దానికి కారణం శేఖర్ కమ్ముల గత సినిమా ఫిదా ఏకంగా రూ.47 కోట్ల షేర్ వసూలు చేయడమే. దానికి తోడు సాయిపల్లవి సినిమాలో ఉంది అంటే ఖచ్చితంగా అంచనాలు మరో స్థాయిలో ఉంటాయి. లవ్ స్టోరీ సినిమాపై అంచనాలు పెరగడానికి ఆమె కూడా ఒక కారణం.
ఈ నేపథ్యంలో లవ్‌స్టోరీ సినిమా బిజినెస్ దాదాపు రూ.32 కోట్లకు పైగా జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత బిజినెస్ జరగడం చాలా కష్టం. కానీ లవ్ స్టోరీ సినిమాపై ఉన్న అంచనాలు విడుదలవుతున్న తీరు చూస్తుంటే.. పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ వసూలు చేయడం పెద్ద కష్టం కాదనిపిస్తుంది. రూ.33 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగుతుంది ఈ సినిమా. ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ చాలా చోట్ల సినిమాను సొంతంగా విడుదల చేసుకుంటున్నాడు. మరోవైపు ఇప్పటికే ఈ మూవీకి శాటిలైట్, డిజిటల్ కలిపి రూ.17 కోట్ల వరకు నిర్మాతలకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా థియేట్రికల్ బిజినెస్‌తో పాటు అన్ని కలిపి లవ్‌స్టోరీ మూవీ రూ.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్.