Friday, November 22, 2024

Engagement – అనుకున్న‌దే అయింది… వైభవంగా నాగ చైతన్య, శోభితల నిశ్చితార్థం..

ర‌హ‌స్య ప్రేమికుల నిశ్చితార్థం
రెండో పెళ్లికి శోభిత ధూళిపాళ్ళ తో నాగ చైత‌న్య రెడీ
గ‌త కొన్నేళ్లుగా శోభిత తో డేటింగ్
సమంత‌తో విడాకుల‌కు కార‌ణం ఇదే
ఘనంగా అక్కినేని ఇంట నిశ్చితార్ధం వేడుక

అనుకున్న‌దే అయింది.. నాగ చైత‌న్య త‌న ర‌హ‌స్య ప్రేమికురాలిని వివాహం చేసుకోనున్నాడు.. ఆమే శోభిత ధూళిపాళ్ళ . నేడు నాగచైతన్య ఎంగేజ్ మెంట్ ఈ రోజు అతికొద్ది మంది సమక్షంలో జరగనుంది. ప్ర‌స్తుతం ఈ వార్త టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

తన సినీ కెరిరీ లో మెుదటి హిట్ సినిమా ఏమాయ చేసావేలో చైతన్యకు జోడిగా నటించిన సమంతతో 2017 అక్టోబరు 6న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కాని ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. అభి ప్రాయబేధాల కారణంగా ఇరువురు పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తరువాత అదే అక్టోబరులో విడిపోతున్నట్టు ప్రకటించారు.

వారి విడాకులపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. సమంతాదే తప్పని కొందరు వాదిస్తే కాదు చైతన్యదే తప్పని కొందరు సోషల్ మీడియాలో ఆరోపణలు నడిచాయి. అయితే సమంతతో వైవాహిక జీవితానికి శుభం కార్డు పడిన తర్వాత నాగ చైతన్య. శోభితా ధూళిపాళ్ళ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే స‌మంత‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత కూడా శోబితాతో నాగ చైత‌న్య ఆమెతో సంబంధాన్ని కొన‌సాగించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.. దీంతోనే స‌మంత విడాకులు తీసుకున్న‌ట్లు వాద‌న‌లూ ఉన్నాయి..
ఇది ఇలా ఉంటే ఇరు కుటుంబాలు అంగీకారం మేరకు, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం నేడు జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా నేడు అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మీడియా అనుమతించ లేదు. కార్యక్రమం అనంతరం ఈ నిశ్చితార్ధం విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారకంగా ప్రకటించి నూతన జంట ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

అక్కినేని కుటంబానికి కోడలిగా రాబోతున్న శోబిత 1993, మే 31న వేణుగోపాల్‌ రావు, శాంత దంపతులకు జన్మించారు. తెనాలి స్వస్థలం. విశాఖపట్నంలో లిటిల్‌ ఏంజెల్స్‌ స్కూల్‌, విశాఖ వ్యాలీ స్కూల్‌లో చదివింది. ముంబై యూనివర్సిటీ, హెచ్‌.ఆర్‌ కాలేజ్‌లో కామర్స్‌, ఎకనామిక్స్‌ పూర్తి చేసింది. సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచారు. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. 2013 మిస్‌ ఎర్త్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టారు. 2016లో తొలిసారి నటించారు. అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో ‘రామన్‌ రాఘవ్‌’ చిత్రం చేశారు. ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. 2018లో తెలుగులో వచ్చిన ‘గూఢాచారి’, 2022లో వచ్చిన ‘మేజర్‌’ సినిమాలతో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement