Tuesday, November 26, 2024

అంతరిక్షంలో మిస్టరీ నక్షత్రాలు.. 20 నిముషాలకు ఒకసారి మిణుకు మిణుకు

ఆకాశంలో విలక్షణంగా గోచరిస్తున్న రెండు నక్షత్రాలను శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇవి ప్రతి 20 నిముషాలకు ఒకసారి రేడియో తరంగాలను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ప్రకారం, పల్సర్‌ల నుంచి ఇలాంటి పునరావృత సంకేతాలు వస్తుండటం సాధారణంగా జరిగే ప్రక్రియే. అంతరిక్షంలో లైట్‌హౌస్‌ల వంటి శక్తివంతమైన కిరణాలను విడుదలచేసే న్యూట్రాన్‌ నక్షత్రాలు తిరుగు తుంటాయి. అవి కొత్తరకం నక్షత్ర వస్తువుగా కనిపిస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

నేచర్‌ జర్నల్‌ లో ప్రకటించిన రెండు నక్షత్రాలు న్యూట్రాన్‌ స్టార్‌ కంటే చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఇవి విభిన్నంగా కనిపిస్తున్నాయి అని వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాలోని బెంట్లీకి చెందిన కర్టిన్‌ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త నటాషా హర్లీ వాకర్‌ చెప్పారు. అవి అరుదైన మాగ్నెటార్‌ కావచ్చొని సూచించారు. దానికి గ్లీమ్‌-ఎక్స్‌ జె162759.5, 523504.3 అని పేరు పెట్టారు. గతంలో 2018లోనూ ఇలాంటి నక్షత్రం కనిపించిందని నటాషా హర్లీ వాకర్‌ తెలిపారు.

మూడు నెలలపాటు మెరుపులు విరజిమ్మి ఆ తర్వాత క్రమంగా మసకబారింది. కొన్నాళ్ల తర్వాత ఆకాశం నుంచి మాయమైంది అని చెప్పుకొచ్చారు. అలాగే 2022లో నషాటా బృందం జరిపిన ఖగోళ పరిశోధనలో ఇలాంటి వస్తువు ఒకటి కనిపించింది. అది 1988 నుంచి మిణుకు మిణుకు మంటున్నట్లు గుర్తించారు. దానికి జీపీఎం జె1839-10 అని పేరు పెట్టారు. రెండు వస్తువులు ఒకేలా ఉన్నప్పటికీ, ఒకటి మూడు నెలలకు మాయం కావడం, ఇంకొకటి 33 ఏళ్లుగా ఉనికిలో ఉండటం ఏమిటన్నది వీరికి అంతుచిక్కలేదట.

Advertisement

తాజా వార్తలు

Advertisement