హైదరాబాద్, ఆంధ్రప్రభ : నకిలీ లేఖ సృష్టించి పోర్జరీ సంతకంతో తాను ఢబ్బులు ఇవ్వాలంటూ తన సినిమాను విడుదల కాకుండాఅడ్డుకున్న నట్టి క్రాంతి కుమార్, నట్టి క్రాంతిలపై చర్యలు తీసుకోవాలంటూ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్ పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గత నెల 8 వ తేదీన విడుదలవ్వాల్సిన మా ఇష్టం సినిమాను విడుదల కాకుండా నట్టి క్రాంతి కుమార్, కరుణలు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారని పేర్కొన్నారు. 30 నవంబర్ 2020 న తన లెటర్ హెడ్ తీసుకుని పోర్జరీ పత్రాలు సృష్టించి తానే వారికి డబ్బులు బాకీ ఉన్నట్లు హైకోర్టులో కేసు వేసి అడ్డుకున్నారన్నారు. హైకోర్టును తప్పు దోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. పోర్జరీ సంతకాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి నిజానిజాలను నిగ్గు తేల్చాలని పోలీసులను కోరినట్లు తెలిపారు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..