బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాని లవ్ మ్యారేజ్ చేసుకుంది హీరోయిన్ అదితిరావు హైదరీ. అయితే వీరి బంధం మాత్రం మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది. ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేసుకోకముందే వీరు విడిపోయారు. 2009లో వీరి పెళ్లి జరగ్గా.. 2013లో వీరు విడిపోయారు. ఇద్దరు ఎవరి లైఫ్ వారు జీవిస్తున్నారు. ఈక్రమంలో వీరు మరో సారి వార్తల్లో నిలిచారు. గా అదితిరావు హైదరీ మాజీ భర్త.. సత్యదీప్ మిశ్రా రెండో పెళ్లి చేసుకున్నారు. మసాబా గుప్తాను ఆయన రెండో పెళ్ళి చేసుకున్నారు. ఈక్రమంలో ఈ విషయంపై ఆయన స్పందించారు. తన పెళ్లి తో పాటు.. మాజీ భార్య అదితిరావు హైదరీ గురించి సంచలన ఆరోపణలు చేశాడు సత్యదీప్ మిశ్రా. అదితితో నా రిలేషన్ కారణంగా.. నాకు ప్రేమ మీదనే విరక్తి కలిగింది.
మరోసారి ప్రేమలో పడటం అంటేనే భయం కలిగింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు.. మళ్లీ రిలేషన్, ప్రేమ అంటే భయపడతారు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం అన్నారు. కాగా తెలుగులో అంతరిక్షం, వీ, మహాసముద్రం సినిమాలలో నటించింది అదితి. కాని ఇప్పటి వరకూ సాలిడ్ హిట్ కొట్టలేకపోయింది చిన్నది. ప్రస్తుతం తమిళ హీరో.. లవర్ బాయ్ సిద్ధార్థ్ తో డేటింగ్ రూమర్స్‌తో డైలీ వార్తల్లో నిలుస్తోంది. సిద్ధార్థ్‌తో రిలేషన్లో ఉంది అనేది చెప్పకనే చెప్పారు ఈ జంట. తాజాగా శర్వానంద్ నిశ్చితార్ధానికి వీరిద్దరూ జంటగా హజరవ్వడంతో కన్ ఫార్మ్ చేసుకుంటున్నారు ఆడియన్స్.