Monday, November 25, 2024

కెసిఆర్ తో నా అనుభవాలు…

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యక్తిత్వం మహోన్నతం. ఎందరి జీవితాలకో మార్గదర్శి. మరెందరికో స్ఫూర్తిప్రదాత. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఆయనను చాలా దగ్గరినుంచి పరిశీలించారు. చిన్నప్పటి నుంచే ఆయన తనకు తెలిసినా… గడిచిన రెండు దశాబ్దాలుగా ఆయనతో గడిపిన తీపి జ్ఞాపకాలు ఎన్నో తనకున్నాయి. ఆయనలోని దార్శనికుణ్ణి, సైద్ధాంతిక పోరాట యోధుణ్ణి, ప్రజా సేవకుణ్ణి, తెలంగాణా రాష్ట్ట్ర ఉద్యమ నాయకుణ్ణి, తెలంగాణ రాష్ట్ట్ర సమితి వ్యవస్థాపకుణ్ణి, కేంద్ర మంత్రిని, ఇప్పుడు రాష్ట్ట్ర ముఖ్యమం త్రిని చూస్తున్నారు. తనకు ఇంతటి ప్రేరణ ఇచ్చిన మరో వ్యక్తి తన జీవితంలో లేరని అంటున్నారు సంతోష్‌కుమార్‌. కేసీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆయన నుంచి నేర్చుకున్న మంచి లక్షణాలను, ఆయనతో తనకున్న జ్ఞాపకాలను ‘ఆంధ్రప్రభ’ పాఠకులకు పంచుతున్నారు. కేసీఆర్‌ జన్మదినోత్సవం సమీపిస్తున్న సందర్భంగా ఆ వివరాలు మీ కోసం..
-ఎడిటర్‌

మర్యాదకు నిర్వచనం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారితో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నప్పటికీ గత రెండు దశాబ్దాలుగా ఆయనతో గడిపిన తీపి జ్ఞాపకాలెన్నో. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి ఆయనతో ప్రతిక్షణం సన్నిహితంగా ఉండి పనిచేసే ఆవకాశం నాకు కలిగింది. ఆయనతో ఉన్న ఆ సమయం నాకు కొత్త విషయా లెన్నింటినో నేర్చుకోవడానికి అవకాశం కల్పించింది.
ఈ అన్ని సంవత్సరాల్లో ఆయనను నేను చాలా దగ్గర నుంచి పరిశీలించాను. ఆ సందర్భంగా ఆయనలోనేను ఒక దార్శనికుణ్ణి, సైద్ధాంతిక పోరాట యోధుణ్ణి , ప్రజా సేవకుణ్ణి, తెలంగాణా రాష్ట్ట్ర ఉద్యమ నాయకుణ్ణి , తెలంగాణ రాష్ట్ట్ర సమితి వ్యవస్థాపకుణ్ణి, కేంద్ర మంత్రిని, ఇప్పుడు రాష్ట్ట్ర ముఖ్యమం త్రిని చూశాను… చూస్తున్నాను. ఆయన ప్రస్థానంలో ఉత్థాన పతనాలు, ఆశానిరాశలు వంటివి ఉన్నా యి. అంతేకాక వాటిని అధిగమించడం కూడా ఆయనకు తెలుసు.
ఆయనను నా గురువు లేదా మార్గదర్శకునిగా చెప్పుకోవడం అతిశయోక్తిగా కనిపించవచ్చేమో గాని కాదు. నా జీవితంలో నాకు ఇంతగా ప్రేరణనిచ్చిన, నా వ్యక్తిత్వాన్నిమలచిన, నన్ను మరింత మానవీయునిగా తీర్చిదిద్దిన వారు మరొకరు లేరు.
ఫిబ్రవరి 17 ఆయన జన్మదినం. ఇది నాకే కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, దేశ విదేశాలలోని ఉన్న అందరికీ ఒక ప్రత్యేకమైన రోజు. నీతి, విలువల విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ఆధునిక ఉద్యమాలలో ఏ విధంగా పోరాటం సాగించి గమ్యం చేరుకోవాలో దిశానిర్దేశం చేసినందుకు కూడా ఇది మనకు ఒక ప్రతే ్యకమైన సందర్భం. ఈనాడు తెలంగాణా సాధించిన పురోగతి, సుసంపన్నత ఆయన సాధించిన, సాధించ నున్న ఘనకార్యాలకు సాక్ష్యంగా నిలుస్తుంది.
కేసీఆర్‌గారు నా జీవిత గమనానికి మార్గ నిర్దేశం చేసి తమ ఆదర్శవం తమైన ప్రవర్తన, క్రమశిక్షణతో కూడిన జీవిత విధానంతో నా జీవిత గమనానికి మార్గనిర్దేశం చేసి మంచి వ్యక్తి త్వమనే బీజాలను నాటి ఎటువంటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొనేలా సానుకూల దృక్పథాన్ని ప్రోది చేశారు. ఆయన విలువైన సలహాలు, ఇతరులకు ఆదర్శవంతమైన ప్రవర్తన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం తోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. చాలా సందర్భాల్లో ఆయ న ఇచ్చిన ఒక్క సలహాయే సరైన ది శగా కార్యాచరణకు మార్గం చూపేది.
నేను నా హృదయం లోతుల్లోంచి చేప్పాలనుకున్న కొన్ని విషయాలు ఇవే. ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజు నుంచి కెసీఆర్‌ గారితో నా ప్రస్థానంలోని ఆసక్తికరమైన సంఘటనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
పరోక్షంలో కూడా ఇతరుల విషయంలో
ఎలా ప్రవర్తించాలి ?
ఇది నాకున్న ఒక జ్ఞాపకం. కేసీఆర్‌గారు కేంద్ర మంత్రిగా ఉన ్న ప్పుడు ఇది జరిగింది. ఒక రోజు ఉదయం ఆయన తమ నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. నేను ”డ్రైవర్‌ అహ్మద్‌ గాడీ నికాలో” అని డ్రైవర్‌కు చెప్పాను. ఇది విన్న కేసీఆర్‌ గారు నన్ను వెంటనే పిలిచి ఇతరులతో గౌరవంగా ఎలా మాట్లాడాలో తెలిపారు. ”మీరు ఎవరితో మాట్లాడుతున్నారన్నది అనవసరం. మీరెవరితో మాట్లాడుతున్నా వారి వయసు, స్త్రీలా? పురుషులా? వారి పదవి, హోదా ఏవైనా పేరు చివర ‘గారు’ లేదా ‘జీ’, లేదా ‘ఆప్‌’ అనే సంబోధన, ‘భాయ్‌’ బెహెన్‌ అనేవి చేర్చి వారితో మాట్లాడాలి. వారు లేనప్పుడు కూడా వారి గురించి అలాగే మాట్లాడాలి. మన చుట్టూ ఉన్నవారితో ఆరోగ్యకరమైన బంధం ఏర్పాటు చేసుకునేందుకు ఇది కీలకం. అదే మనను మంచి మనిషిిగా మలుస్తుంది” అని చెప్పారు.
నమ్మండి, నమ్మకపొండి ఆ రోజు నుంచి నేను నా చిన్న నాటి మిత్రులు, అతి సన్నిహితులు మినహా ఈ గౌరవ వాచ్యాలు లేకుండా ఎవరినీ సంబోధించలేదు. ఇప్పుడు అలా కాకుండా మాట్లాడాలన్నా మాట్లాడలేను. ఇది ఆయన సలహాను తీసుకుని బాగా సాధన చేయడం వల్ల వచ్చింది.
రేపటి సంచికలో మరో జ్ఞాపకం…

Advertisement

తాజా వార్తలు

Advertisement