తన భర్త మంజునాథ్ పై పొగడ్తలు కురిపించింది నటి..యాంకర్ లాస్య.కాగా లాస్య రెండోసారి తల్లయ్యారు. నిండు గర్భిణిగా ఉన్న లాస్యకు త్వరలో ప్రసవం కానుంది. ప్రెగ్నెంట్ పీరియడ్ ఆడవాళ్ళకు మరో జన్మతో సమానం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ కారణంగా పెరిగిన పొట్ట ఏ పనీ సులభంగా చేసుకోనివ్వదు. కూర్చోవడం, పడుకోవడం, నడవడం కూడా కష్టమే. గర్భవతిగా తన ఇబ్బందులు తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేసింది. అలాగే భర్త మంజునాథ్ ఎలా దగ్గరుండి చూసుకుంటున్నారో ఆ వీడియోలో తెలియజేశారు. అమ్మలా చూసుకునే భర్త ఉండగా తనకు ఎంత కష్టమొచ్చినా ఎదుర్కోగలని లాస్య పరోక్షంగా తెలియజేశారు. ఇటీవల లాస్య సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement