భారత హాకీ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఎఫ్ఐహెచ్ హాకీ 5ఎస్ ఛాంపియన్షిప్ తొలి సీజన్లో విజేతగా నిలిచింది. ఐదు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో 3 విజయాలతో అగ్రస్థానంలో భారత జట్టు నిలిచింది. ఒక్క ఓటమి కూడా లేకుండా టోర్నీని ముగించారు మన ఆటగాళ్లు. ఫైనల్ ఆరంభంలో పొలాండ్ జట్టు జోరుమీద కనిపించి, వరుసగా మూడు గోల్స్ చేసింది. అప్పటికి భారత్ ఒక్క గోల్ కూడా చెయ్యలేదు.
అయితే వెంటనే తేరుకున్న భారత జట్టు రెండు గోల్స్ వేసింది. కాసేపటికే మరో రెండు గోల్స్ చేయడంతో 4-3 స్కోరుతో భారత జట్టు ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత పోలాండ్ మరో గోల్ చేసినప్పటికీ.. మరో రెండు గోల్స్ చేసిన భారత్ 6-4తో ఛాంపియన్గా నిలిచింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.