Saturday, November 23, 2024

మా అక్కయ్య పేరే.. నా కూతురికి పెట్టా.. ఆలీ

తన గురించి పలు పర్సనల్ విషయాలను పంచుకున్నారు కమెడియన్ అలీ . మా అమ్మానాన్నలకు మేము ఏడుగురం సంతానం. నాకు ఇద్దరు అక్కయ్యలు .. ముగ్గురు చెల్లెళ్లు .. ఒక తమ్ముడు. ఇంతమందిని కూడా మా ఫాదర్ మిషన్ కుట్టి పోషించేవాడు. భరతనాట్యం .. కూచిపూడి డ్రెస్సులు కుట్టడంలో ఆయన ఫేమస్. ఆయన కుట్టిన బట్టలను నేను ఇస్త్రీ చేసేవాడిని. అప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులతో సినిమాలు చూసేవాడినని చెప్పారు. మా అక్కయ్య ఫాతిమా గర్భిణిగా ఉన్నప్పుడు, స్టౌపై పాలు కాచి ఆ గిన్నెను దింపుతూ ఉంటే చున్నీ అంటుకుంది. ఆ మంటలతో ఆమె అరుస్తూ బయటికి రాగానే అక్కడున్నవారు ఆమెపై నీళ్లు పోశారు. ఆ ప్రమాదంలో మా అక్కయ్యతో పాటు కడుపులో బిడ్డ కూడా చనిపోవడం జరిగింది. ఆమె పేరునే నా కూతురికి పెట్టడం జరిగింది. ఆ సంఘటన నుంచి మేమంతా కోలుకోవడానికి చాలా కాలం పట్టిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement