Wednesday, November 20, 2024

Bharat Jodo | నా అన్నను ‘షీల్డ్​ ఆఫ్​ ట్రూత్​” కాపాడుతోంది.. భయపడాల్సిన అవసరం లేదు: ప్రియాంక ​

కాంగ్రెస్​ ముఖ్య నేత, తన సోదరుడు రాహుల్​ గాంధీ సత్యం అనే కవచం ద్వారా రక్షణ పొందుతున్నాడని, ప్రజల ప్రేమ ఉంటే ఎంత చలి అయినా తట్టుకునే శక్తి వస్తుందని అన్నారు పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ. శీతాకాల విరామం తర్వాత ఇవ్వాల (మంగళవారం) మళ్లీ భారత్​ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీడియాతో ప్రియాంక చిట్​చాట్​ చేశారు. తనకు చాలామంది నుంచి ఇదే ప్రశ్న ఎదురవుతోందని, రాహుల్​ గాంధీ చలిని తట్టుకునేలా ఎందుకు జాకెట్​ వేసుకోవడం లేదని అడుగున్నారని తెలిపారు. ‘‘నా అన్నకు భయం అనేది లేదని, ప్రజలే అతని రక్షణ కవచంగా ఉంటారు”అని చెప్పారు ప్రియాంక.

ఇక.. మంగళవారం ఘజియాబాద్‌లోకి రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ ఇన్​చార్జి, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా వెంట ఉన్నారు. ఘజియాబాద్‌లోని సరిహద్దు మీదుగా ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించే ముందు కొద్దిసేపు విరామం తర్వాత యాత్ర పునఃప్రారంభమైంది. భారత్ జోడో యాత్రకు సంబంధించిన భద్రతపై కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య తరచూ ఎన్‌కౌంటర్‌లు జరిగే జమ్మూ కాశ్మీర్‌లోకి యాత్ర ప్రవేశించబోతున్నందున ఆందోళన మరింత పెరిగింది.

కాగా, డిసెంబర్ 24న కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. యాత్రకు సంబంధించిన ఆందోళనలను లేవనెత్తారు. దీనిని అనుసరించి భారత్​ జోడో యాత్రికులకు రాష్ట్రంలో ఫూల్‌ప్రూఫ్ భద్రత లభిస్తుందని పంజాబ్ టాప్ కాప్ చెప్పారు. యాత్ర వివరాలను స్థానిక కార్యకర్తలతో చర్చించేందుకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PPCC) అధ్యక్షుడు రాజా వారింగ్ రాజ్‌పురా, ఘనౌర్, పాటియాలా వంటి సెన్సిటివ్​ ఏరియాలను సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement