Saturday, November 23, 2024

ముత్తయ్య మురళీధరన్ డిశ్చార్జ్

శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ (49) సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ గా ఉన్న మురళీధరన్ ఆదివారంగుండెపోటు రావడం
తో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆదివారం సీనియర్ కార్డియాలజిస్ట్ సెంగొట్టువేలు ఆధ్వర్యంలో వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేసి స్టెంట్ అమర్చారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో సోమవారం డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.కాగా శ్రీలంక
తరపున 188 టెస్టులు, 350వన్డేలు, 12టీ20ల్లో మురళీధరన్ ప్రాతినిధ్యం వహించాడు.టెస్టుల్లో అత్యధికంగా 800 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

అదేవిధంగా వన్డేల్లో 584 వికెట్లు, టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. 1996 ప్రపంచకప్ విజేతగా నిలిచిన శ్రీలంక జట్టులో మురళీధరన్ సభ్యుడిగా ఉన్నాడు. ఏడు రోజుల క్వారంటైన్ అనంతరం మురళీధరన్ జట్టుతో కలుస్తాడని ఎస్ఆర్ హెచ్ ప్రతినిధులు తెలిపారు. మురళీధరన్ 2015 నుంచి సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ గా మెంటార్ గా సేవలందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement