Friday, November 22, 2024

Spl story | మీసాల రొయ్యకి భలే గిరాకి.. మన్యంలో బొడ్డెంగుల సీజన్!

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: సాధరణంగా అనేక మంది భిన్నమైన ఆహారాలు తింటు-ంటారు. మనం చేపలు, మాంసం, రొయ్యలు, పీతలు వంటి పలు మాంసాహాలు తింటుంటాం. అదే చైనీయులైతే పాములు, కప్పలు, పురుగులు ఇష్టంగా లొట్టలేసుకుని తింటారు. కానీ విశాఖ ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల సంప్రదాయం సంస్కృల మేళవింపుగా ఎలా ఉంటుందో ఆహారపు అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. వాస్తవానికి గిరిజనులు తినే ఆహారాలు చాలా వెరైటీగా ఉంటాయి. అలాగే చక్కటి బలవర్థకమైనవిగా ఉంటాయి. అటు వంటివే బొడ్డెంగుల పురుగులు కూర. వీటిని ముద్దుగా (మీసం లేని మన్యం రొయ్యిలుకూ) గా గిరిజనులు పిలుస్తుంటారు. అదికూడా రాగి అంబలితో నంజుకుంటూ మరీ లోట్టలేసుకుని తింటున్నారు. అల్లూరి జిల్లా అరకు, పెదబయలు, ముంచ్చింగిపుట్టు, డుంబ్రిగుడ, పాడేరు, జి.మాడుగుల తదితర మండలాల్లోగల లోతట్టు గిరిజన ప్రజలు మన్యం రొయ్యలను జీవనోపాధిగా ఎంచుకొని ఆదాయ వనరులుగా మల్చుకుంటున్నారు. రొయ్యల ఆకారాన్ని పోలి ఉండడంతో వీటిని అడవి రొయ్యలు అని కూడా అంటారు. మన్యం మొత్తం చూసుకుంటే జి.మాడుగుల మండలంలో అధికంగా లభ్యమవుతాయని చెప్పవచ్చు. ఈత దుబ్బుల నుంచి సేకరించిన బొడ్డెంగులను వేపుడు, కూరలుగా తయారు చేసుకొని భోజనం చేస్తారు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి.

విశాఖ ఉమ్మడి జిల్లా మన్యంలో లభిస్తున్న బొడ్డెంగులంటే గిరిజనులకు ఎంతో ప్రీతి.నోరూరించే బొడ్డెంగులు సీజన్‌ మొదలైంది. శీతాకాలంలో దొరికే ఈ బొడ్డేంగిలు అరదుగా లభిస్తాయి. బొడ్డెంగులు ఎంతో రుచికరంగా వుంటాయి.గిరిజనులు మాంసాహారంగా ఈ బొడ్డేంగిలను భావించి లొట్టలేసు కుని మారి తింటారు. ఈ బొడ్డెంగులకు గిరిజన ప్రాంతాల్లో చాలా డిమాండ్‌ వుంటుంది. గిరిజన ప్రాంతాల్లో విరివిగా లభించే బొడ్డెంగులు ఎంతో రుచికరమైన మాంసాహారంగా భావించి ఇక్కడ ప్రజలు లొట్టలేసుకుని తింటారు. బొడ్డెంగులకు ఈగిరిజన ప్రాం తాల్లో ఎంతో డిమాండ్‌ ఉంది. బొడ్డెంగులు డిసెంబర్‌ నెల నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ లభిస్తాయి. గిరిజన గ్రామాలకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఈత దుబ్బులు ఉన్న చోట బొడ్డెంగులను గుర్తించి వాటిమొదలు వద్ద తవ్వి సేకరిస్తారు. ప్రతి ఒక్కరు వీటిని సంవత్సరానికి ఒక సారైనా తినకకుండా ఉండరు. ఇవి బయటకు తెల్ల పురుగులు మాదిరిగానే కన్పిస్తాయి. బొడ్డంగుల శరీరమంతా పూర్తిగా కొవ్వు పదార్థం. ఈప్రాంతంలో బొడ్డెంగులను మన్య ప్రాంత రొయ్యలుగా పిలుస్తారు. ఈత దుబ్బుల నుంచి సేకరించిన బొడ్డెంగులను వేపుడు, కూరలుగా తయారు చేసుకొని రాగి అంబలితో నంజుకుంటూ ఆరగిస్తున్నారు.

ఇక్కడ గిరిజనుల ఆహారశైలిలో ఇదోక భాగం..

- Advertisement -

చేనుకు పురుగు పడితే మందులు చల్లుతారు.. కానీ అక్కడ పురుగు పడితే పండగ చేసుకుంటారు. పురుగులను వంట చేసుకొని తింటారు. పురుగులే వారికి జివ్వరుచి. ఇదిగో ఇవే తెల్లటి పురుగులు గిరిపుత్రులకు ఎంతో ఇష్టమైన ఆహారం. ఆ పురుగులను తినడమేకాకుండా.. వాటిని తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మీసం లేని మన్యం రొయ్యగా వీటికి పేరుంది. ఏజెన్సీలో పూర్వకాలం నుంచి ఈపురుగులు తినడం ఆచారం. ముఖ్యంగా గిరిపుత్రుల ఆహారశైలిలో ఓభాగం. ప్రస్తుతం ఆ పురుగులను సేకరించి అమ్ముతూ కొంతమంది గిరిజనులు జీవనోపాధి పొందుతున్నారు. ఏజెన్సీలో బొడ్డెంగు పురుగులకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడిరది. గిరిజనులు ఎక్కువగా భోజనాలు, జీలుగకల్లు, విప్పసారా, పనససారా, బియ్యం సారా మద్యం తాగేవారు నంజకం(స్టఫ్‌)గా, ఇళ్లకు బంధువులు వచ్చిన ప్పుడు బొడ్డెంగులుతో విందులు ఏర్పాటు చేస్తారు.

వేట కష్టమే..

ఏజెన్సీప్రాంతంలో ఏతైన కొండలపై ఉన్న ఈతచెట్టు-ల దుబ్బుల కింద పెరిగే ఈపురుగులను.. మన్యం రొయ్యగా అభివర్ణిస్తారు. వీటిని స్థానికులు బొడ్డెంగులుగా పిలుస్తారు.వీటి వేట కూడాచాలా కష్టమే. కుటుంబ సమేతంగా కొన్ని మైళ్లు దూరం కొండలెక్కిదిగి రావాల్సిందే. వీటి వేటలో ఒక్కోసారి గిరిజనులకు తీవ్రమైన గాయాలు, పాముకాట్లులకు గురవుతున్నారు. సాధారణంగా ఇవి ఈత కాండంతింటూ.. పెరగడంతో కొవ్వు కలిగి ఉంటుంది. ఈ పురుగులను స్థానికులు వేయించుకుని తినడంతోపాటు కూరగా కూడా వండు కుంటారు. ప్రతి ఏటా సంక్రాంతికి ఈపురగులు లభించడంతో గిరిపుత్రులు పండుగ చేసుకుంటారు. ప్రస్తుతం వీటి రుచి మైదాన ప్రాంతవాసులను ఆకట్టుకోవడంతో పురుగులు సేకరించి సంతల్లో అమ్ముతున్నారు. ఒక్కో ఈత దుబ్బు నుండి రెండు లేక మూడు పురుగులు మాత్రమే లభిస్తున్నాయి. దీంతో రాత్రంతా పురుగుల వేట సాగించి.. ఉదయాన్నే అమ్మకానికి బయలుదేరుతారు.

నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోతున్నాయంటే ఏజెన్సీలో వీటిని ఎంత డిమాండ్‌ ఉందో తెలుస్తుంది. ఆహారంతోపాటు ఆదాయవనరుగా పురుగులు మారడం విశేషం. జి.మాడుగుల సొలభం, గెమ్మెలి, గడుతూరు, పెదలోచలి, సింగర్భపంచాయతీలు, అలాగే పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీలోని పలు గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో ఉన్న కొండల్లో అధికంగా బొడ్డెంగులు లభ్యమవుతాయి. వీటిని ప్రస్తుతం రూ.10లకు నాలుగు చొప్పున విక్రయిస్తున్నారు. మొదట గిరిజనులు మాత్రమే ఈ బొడ్డెంగులు ఆహారంగా తీసుకునే వారు. క్రమంగా మైదాన ప్రాంతవాసులు సైతం అలవాటుగా మార్చుకోవడంవల్ల బొడ్డెంగులకు డిమాండ్‌ పెరిగిందని చెప్పక తప్పలేదు. ప్రతి ఆదివారం ఆయా గ్రామాల్లో ముందస్తు ఆర్డరు ఆధారంగా సేకరించిన బొడ్డెంగులు విక్రయాలు జరుగుతుంటాయి.

రక్తపుష్టినిస్తాయి..

రక్తహీనత ఉన్నవారు బొడ్డెంగులను వేపుడు, కూరగా తయారు చేసుకుని తింటే ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. బొడ్డెంగులు రక్తపుష్టిని కలగజేస్తాయని, పౌష్టికాహారమవుతుందని వారు అంటున్నారు. గిరిజనులు ఎక్కువగా భోజనాలు, జీలుగ కల్లు, మద్యం తాగేవారు నంజకం (స్టఫ్‌)గా, ఇళ్లకు బంధువులు వచ్చినప్పుడు బొడ్డెంగులుతో విందులు ఏర్పాటు చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement