పంజాబ్ తీర్పుపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు. నాలుగున్నరేళ్ల పాలనతో కాంగ్రెస్ ఓడిపోయిందన్న విమర్శల్లో నిజం లేదన్నారు. రణదీప్ సుర్జేవాలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇంత జరిగినా.. కాంగ్రెస్ నేతలు మాత్రం పాఠాలు నేర్చుకోరని, తన వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్న మాటే నిజమైతే.. యూపీలో ఓటమికి కారణం ఎవరని ప్రశ్నించారు. మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ పరిస్థితేంటన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఓటమి నుంచి పాఠాలు ఎప్పుడూ నేర్చుకోలేదన్నారు.
బలమైన నాయకత్వం కాంగ్రెస్లో వచ్చేంత వరకు పరిస్థితి ఇలాంగే ఉంటుందని విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఇప్పటికైనా కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకుంటే మంచిదంటూ హితవు పలికారు. పంజాబ్లో కాంగ్రెస్ ఓటమికి తనను బాధ్యుడిని చేయడం సరికాదంటూ.. ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..