Friday, November 22, 2024

Special story : బుడ‌గ పేలింది…అధినేత గుర్తించాలి…

- Advertisement -

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజకీయాల్లో పార్టీలకు గెలుపోటములు, నేతలకు ఎత్తుపల్లాలు సహజం. అయితే, మొక్కవోని దీక్షతో తిరిగి తదేకదీక్షతో జనంలో జనం కోసమే జనసమస్యలపై పోరాడుతుంటే మళ్లి అదే జనం అక్కు న చేర్చుకోవడం కూడా అంతే సహ జాతిసహజం. ఇది చరిత్ర చెబు తున్న సత్యం. ఎప్పటి సంగతు లనే వదిలేసి 2018-19 ఎన్నికల నుంచి బోలెడు ఉదాహరణలు తీసుకోవచ్చు. పడి లేచిన కెర టంలా పార్టీలు, నేతలు బౌన్స్‌ బ్యాక్‌ అయిన తీరు ఎంతైనా ఉత్ప్రే రణ కలిగిస్తాయి. కాని, మొన్న జరి గిన ఎన్నికల్లో చతికిలపడిన కొంద రు కాకలు తీరిన నేతలు మాత్రం కాడిపారేసినట్టు కనిపిస్తోంది. పదేళ్లపాటు ఏలి, అధికారాన్ని అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తాజా లు, మాజీలు ముఖం చాటేస్తున్నారు.

మరికొందరు కండువా మార్చేస్తు న్నారు. ఇంకొందరు తమకు ఆర్ధిక సత్తా లేదని మిన్నకుంటున్నారు. కేసీఆర్‌ కుటుంబం పట్ల అసం తృప్తి ఉంటే అంతర్గతంగా చర్చించాలి. అంతేకాని, ఇబ్బం దుల్లో ఉన్నప్పుడే పుట్టి ముంచా లని చూడడం ద్రోహంగానే పరిగ ణించాలని శ్రేణులు విమర్శిస్తున్నా యి. ఇంతటి నీతిమాలిన నాయక గణాన్ని నమ్మి కేసీఆర్‌ కుటుంబం పయాణం చేసిందన్న ఆవేదన కార్యకర్తల్లో కనిపిస్తోంది. 2018-19 ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని నాటి తెరాస సొంతం చేసుకుంది. 40 శాతానికి పైగా ఓట్లతో 88 సీట్లు గెలుపొందింది. కేవలం 28 శాతానికే పరిమితమైన కాంగ్రెస్‌ 18 సీట్లకే పరిమితమైంది. 108 సీట్లలో డిపాజిట్‌ కోల్పోయిన భాజపా కేవలం ఒకే ఒక సీటులో విజయం సాధించింది. అసెంబ్లి పోరులో రేవంత్‌, కోమటిరెడ్డి, ఉత్తమ్‌కు మార్‌ రెడ్డిల సతీమణి పద్మా వతి లు పరాజయం పాలయ్యారు. అలాగే, భాజపా నుంచి దిగ్గజ నేతలు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లు ఇంటి దారి పట్టారు. అయి తే, నాలుగు నెలల తర్వా త వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికల్లో వారే పడిలేచిన కెరటంలో ఎలా ఎగిసిందీ గమ నిస్తే నేతలు రాజకీయాల్లో ఏ విధంగా మనగలగాలో అర్ధమవుతుందంటున్నారు పరిశీలకులు.

గత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా నాలుగు, కాంగ్రెస్‌ మూడు సీట్లలో గెలుపొందాయి. ఒకవైపు అసెంబ్లి ఎన్నికల్లో ఓటమి, మరోవైపు ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ఎమ్మెల్యేలు వలసపోయినా కాంగ్రెస్‌ కేడర్‌, లీడర్‌లు కృంగిపోలేదు. ఎదురొడ్డి నిలిచి మళ్లిd గెలిచారు. అదే రేవంత్‌, కోమటిరెడ్డిలు లోక్‌సభకు పోటీ చేసి గెలిచి శభాష్‌ అనిపించుకున్నారు. తెరాస ప్రవాహానికి ఎదురీదిన తీరు జనాన్ని ఆకట్టుకుని నాలుగు నెలలలోపే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మళ్లి వారిని గెలిపించారు. నల్గొండ జిల్లాలో ఒకే ఒ క అసెంబ్లి సీటుకు కాంగ్రెస్‌ పార్టీ పరిమితమైన అధై ర్యపడకుండా లోక్‌సభ బరిలో నిలబడి, పోరాడి గెలి చారు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.

కరీంనగర్‌ అసెంబ్లి అభ్యర్ధిగా ఓడినా, లోక్‌ సభకు పోటీ చేసి తన సత్తా చాటారు భాజపా నేత బం డి సంజయ్‌కుమార్‌. అదేవిధంగా శాసనసభ ఎన్ని కల్లో ఓడినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రయ్యారు కిషన్‌ రెడ్డి. ఇక నిజామాబాద్‌ జిల్లా లో తెరాస క్లీన్‌ స్వీప్‌ చేసినప్పటికీ, ఏమాత్రం తగ్గ కుండా పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా నాటి సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితపై పోటీ చేసి గెలిచారు అర వింద్‌. నేతల వీర పోరాటానికి, ప్రజా స్వామ్య విలు వలకు, ఓటర్ల విలక్షణ తీర్పునకు ప్రతీకగా నిలి చాయి నాటి ఎన్నికలు.

కాగా, గత అసెంబ్లి ఎన్నికల్లో ఓడిన భారాస నేతలు ఏ మాత్రం స్ఫూర్తి పొందుతున్నట్టు లేదు. జరుగనున్న పార్ల మెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనుక ముందులాడారు. చివరకు ప్రచారం చేయడానికి కూడా ఇష్టపడడం లేదని కార్యకర్తలు విమర్శిసున్నారు. అధికారం పోయి వంద రోజులు దాటక ముందే అమ్మలాంటి పార్టీని వదిలేస్తున్నా రు… పట్టించుకోకుండా తప్పుకు తిరుగుతున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌, మునుగోడులలో డిపా జట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌ బౌన్స్‌ బ్యాక్‌ అయి రాజకీ యాల్లో ఏదైనా సాధ్యమేనని నిరూపించింది. అలాగే, హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌లలో డిపాజిట్‌ కోల్పోయిన భాజపా తన ఓటింగ్‌ శాతాన్ని గత అ సెంబ్లి ఎన్నికల్లో రెట్టింపు చేసుకుంది. రేపటి లోక్‌సభ ఎన్నికల్లో నువ్వా? నేనా? అని కాలుదువ్వుతోంది.
పోరాటంతోనే ఉద్భవించిన భారాస తిరిగి అదే ఉద్యమ స్ఫూర్తితో మళ్లి అధికారం చేజిక్కించుకో వాలంటే వలస నేతలను వదిలి ఆనాటి నుంచి అంటి పెట్టుకుని ఉన్న అసలుసిసలు కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించాలని కేడర్‌ కోరుకుంటోంది. కాంగ్రెస్‌ పాలనలో కలిసివచ్చే అవకాశాలను అందిపుచ్చు కుని అధినేత పోరాటాలకు పిలుపునిస్తే రంగంలోకి దూకేందుకు లక్షలాది సుశిక్షుతులైన కార్యకర్తలు సదా సర్వదా సిద్ధమని స్పష్టం చేస్తున్నారు. వలస నేతలపై సమీక్షలు కాకుండా పార్టీ పునర్నిర్మాణానికి, భవిష్యత్‌ పోరాట వ్యూహాలకు పదును పెట్టాలని కీల క నేతలను శ్రేణులు కోరుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement