హైదరాబాద్, ఆంధ్రప్రభ: జాతీయ, రాష్ట్ర స్థాయి వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే ఎంసెట్, జేఈఈ, సీఏసీపీటీ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ను మంత్రి సబిత ఇంద్రారెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే పోటీ పరీక్షల్లో తమ సత్తా చాటాలని పేర్కొన్నారు. గతేడాది పోటీ పరీక్షల కోసం ప్రభుత్వం కల్పించిన ఆన్‌లైన్ సౌకర్యాన్ని తెలంగాణ విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులూ తమ పేర్లను నమోదు చేసుకొని ఉత్తమ ర్యాంకులు పొందారన్నారు.
http://tscie.rankrs.io లింక్ ద్వారా కోచింగ్ కోసం నమోదు చేసుకోవచ్చని తెలిపారు. నిష్ణాతులైన సిబ్బందితో కోచింగ్ ఇవ్వబడుతోందని మంత్రి తెలిపారు. విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. విద్యార్థులకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా విలువైన సలహాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.