Friday, November 22, 2024

ముస్లింలు మైనారిటీలు కాదు: హిమంతబిశ్వా

అసోం జనాభాలో ముస్లింలు 35 శాతం ఉన్నారని, ఇకపై ఈశాన్య రాష్ట్రంలో వారిని మైనారిటీలుగా పరిగణించలేమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990లో కాశ్మీరీ హిందువుల వలసలను ప్రస్తావిస్తూ, ఇతర వర్గాల భయాలను తొలగించడం రాష్ట్రంలో ముస్లింల కర్తవ్యమని అన్నారు. అసెంబ్లి బడ్జెట్‌ సెషన్‌లో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, ”ఈ రోజు ముస్లిం ప్రజలు ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు సమాన అవకాశాలు, సమాన అధికారాన్ని కలిగి ఉన్నారు. గిరిజనుల హక్కులు పరిరక్షించబడతాయి, వారి భూములు ఆక్రమించబడవు. ఆరో షెడ్యూల్‌ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల భూములను ఆక్రమించాల్సిన అవసరం లేదు. బోరా, కలిత (అస్సామీ ఇంటిపేర్లు) ఆ భూమిలో స్థిరపడకపోతే, ఇస్లాం, రెహమాన్‌ (ముస్లిం ఇంటిపేర్లు) కూడా ఆ భూముల్లో ఉండటానికి వీల్లేదు.

రాష్ట్రంలో ముస్లిం జనాభా మూడోవంతుకుపైగా ఉన్నందున, ఇతర మైనారిటీలను రక్షించడం వారి కర్తవ్యం అని సీఎం అన్నారు. తమ ఇళ్లను విడిచిపెట్టి పారిపోవలసి వచ్చిన కాశ్మీరీ హిందువులతో అస్సామీలను పోల్చుతూ, కాశ్మీరీ పండిట్‌ల మాదిరి పరిస్థితినే అస్సామీలు కూడా ఎదుర్కొంటారా అని ప్రజలు నన్ను అడుగు తున్నారు. మన భయాన్ని పోగొట్టడం ముస్లింల కర్తవ్యం. ముస్లింలు అందుకు అనుగుమంగా మెలగాలి అని సూచించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టేందుకు మమత ప్రయత్ని స్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నందుకు పోలీసులను ఆమె అభినందించారు. రాజకీయ హింసపై ప్రతిపక్షాల ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. ఇటీవల కాంగ్రెస్‌, తృణమూల్‌కు చెందిన ఇద్దరు కౌన్సిలర్ల హత్యలను ఖండిస్తూ, ఈ విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితుల రాజకీయ పలుకుబడిని పరిగణనలోకి తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement