Wednesday, November 20, 2024

ట్విట్టర్‌ కైవసానికి మస్క్‌ ప్రణాళిక.. కొనుగోలుకు ఆర్థిక సంస్థల సాయం రెడీ

సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ సాంతం కైవసం చేసుకునేందుకు టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ట్విట్టర్‌ యాజమాన్యంతో సంబంధం లేకుండానే కొనుగోలు ప్రక్రియను మస్క్‌ ప్రారంభించారు. ట్విట్టర్‌ మొత్తాన్ని కొనుగోలు చేస్తానని ప్రకటించిన వారంరోజుల వ్యవధిలో మస్క్‌ 46.5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్రణాళికను ఆయన సిద్ధం చేశారు. ట్విట్టర్‌ షేర్ల కొనుగోలుకు మోర్గాన్‌ స్టాన్లీ ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయని హామీపత్రాలను మస్క్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డుకు సమర్పించారు.

ట్విటర్‌ కొనుగోలు చేస్తామన్న తమ ప్రతిపాదనకు ఆ సంస్థ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదని అందులో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం మస్క్‌ 9.2శాతం వాటాలతో ట్విట్టర్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. ట్విట్టర్‌ కొనుగోలుకు 43బిలియన్‌ డాలర్లు ఆఫర్‌ చేశారు. అయితే మస్క్‌ యత్నాన్ని నిలువరించడానికి ట్విట్టర్‌ పాయిజన్‌ పిల్‌ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో మస్క్‌ దాదాపు 279బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement