శాన్ప్రాన్సిస్కో : కొనుగోలు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్‌పై ట్విట్టర్ కోర్టను ఆశ్రయించిన విషయం తెల్సిందే. దీనిపై విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ట్విట్టర్ కోర్టును కోరింది. అయితే మాస్క్ మాత్రం విచారణను 2023 వరకు వాయిదావేయాలని కోర్టును కోరారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చిన ఎలాన్ మస్క్ ఇటీవల ఆ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై ట్విట్టర్ కోర్టులో మస్క్‌పై కేసు దాఖలు చేసింది. ఒప్పందంలోని నిబంధనలను మస్క్ ఉల్లంఘించారని ట్విట్టర్ ఆరోపించింది. ముందుగా అనుకున్న ప్రకారమే డీల్‌ను పూర్తి చేయాలని ట్విట్టర్ దావాలో కోరింది. విచారణ చేనస్తే మస్క్‌దే తప్పని తేలిపోతుందని, అందుకే విచారణను త్వరగా పూర్తి చేయాలని కోర్టును ట్విట్టర్ కోరింది. దీనికి మస్క్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
విచారణను 2023 వరకు వాయిదా వేయాలని కోరారు. ఫేక్ అకౌంట్లను దాచిపెట్టిన ట్విట్టర్ , విచారణ త్వరగా పూర్తి కావాలని కోరుతుందని ఆరోపించారు. నకిలీ, స్పామ్ ఖాతాల ను కనిపెట్టేందుకు సమయం పడుతుందని మస్క్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించడానికి సమయం పడుతుందని , అందుకే కేసును 2023కి వరకు వాయిదా వేయాలని కోరారు. విచారణ ఆలస్యం చేయడం ద్వారా , డీల్‌ను ఆటోమెటిగ్గా రద్దు అయ్యేలా చేయడమే మస్క్ వ్యూహమని భావిస్తున్నారు. డీల్‌ను పూర్తి చేయకుంటే మస్క్ పరిహారంగా ఒక బిలియన్ డాలర్లను పెనాల్టిdగా చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి ఈ డీల్ కోసం బ్యాంక్‌లతో కుదుర్చుకున్న రుణ ప్యాకేజీ గడువు ముగుస్తుంది. అప్పటికి విచారణ పూర్తికాకుంటే ఇది ఈ ఒప్పందం రద్దు అవుతుంది. దీంతో ట్విట్టర్ డీల్ కూడా రద్దు అయ్యేలా చేయడమే మస్క్ వాయిదా కోరడానికి కారణమని అమెరికా మీడియాలో కధనాలు వెలువడ్డాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.