ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ మళ్లి అగ్రస్థానానికి చేరుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్డ్ సంపద బుధవారం నాడు 2.6 శాతం తగ్గడంతో ఆయన తన స్థానాన్ని కోల్పోయారు. ఫలితంగా బ్లూబ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచీలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలోకి వచ్చారు. గత సంవత్సరం డిసెంబర్‌లో మస్క్ కంటే సంపదలో ముందుండటంతో అర్నాల్డ్ మొదటిస్థానంలోకి వచ్చారు. టెక్ ఇండస్ట్రీ భారీగా ఒడుదొడుకులు ఎదుర్కొవడం, ట్విటర్ కొనుగోలు తరువాత టెస్లా షేర్లు కూడా పతకం కావడంతో మస్క్ వ్యక్తిగత సంపద తరిగిపోయింది.
ఇదే సమయంలో కరోనా పరిస్థితులు కుదుటపడటంతో విలాస వస్తువుల అమ్మకాలు భారీగా పెరిగాయి. దీని వల్ల ఎల్‌వీఎంహెచ్ షేర్లు లాభపడ్డాయి. దీని వల్ల అర్నాల్డ్ సంపద పెరిగింది. తాజాగా ఆర్ధిక మాం ద్యం భయాల నేపథ్యంలో విలాస వస్తువుల డిమాండ్ తగ్గింది. ఫలితంగా వీటి షేర్ల ధరలు కూడా తగ్గాయి. విలాస వస్తువులను ఉత్పత్తి చేసే ఎల్‌వీఎంహెచ్ షేర్లు ఏప్రిల్‌లో 10 శాతానికి పైగా పతనమయ్యాయి.
ఒక దశలో అర్నాల్డ్ సంపద ఒక్క రోజులోనే 11 బిలియన్ డాలర్లు అవిరయ్యాయి. ఎలాన్ మస్ ్క సంపద మాత్రం ఏటా పెరుగుతోంది. టెస్లా షేర్లు కూడా కనిష్టాల నుంచి పుంజుకున్నాయి. మస్క్ వ్యక్తిగత షేర్లలో 70 శాతం టెస్లా షేర్ల రూపంలోనే ఉంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు టెస్లా షేర్లు 66 శాతం లాభపడ్డాయి. ఫలితంగా ఎలాన్ మస్క్ సంపద 55.3 బిలియన్ డాలర్లు పెరిగి 192.3 బిలియన్ డాలర్లకు చేరింది. అర్నాల్డ్ సంపద 186.6 బిలియన్ డాలర్లుగా ఉంది.