హైదరాబాద్: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం 13,693.02 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు ఆరు క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 7040.73 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
కుడి, ఎడమ కాలువలకు 180.72 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 640.40 అడుగులుగా (3.31 టీఎంసీలు) ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కోఠి సమీపంలోని ముసారాం బాగ్ బ్రిడ్జి వద్ద భారీగా వరదనీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.