టీవీ5 మూర్తి, కొందరు జర్నలిస్టులు తమ నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, ఆయన భార్య వీణ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, వేణు స్వామి, ఆయన భార్య ఆరోపణలపై జర్నలిస్ట్ మూర్తి స్పందిస్తూ…. వారు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని టీవీ లైవ్ షోలో ప్రకటించారు. అంతే కాకుండా వేణుస్వామి, వీణపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. చేయని నేరానికి తనపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆయన నిజాయితీని కించపరిచేలా ఆరోపణలు చేశారని, ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను ఎప్పుడు కూడా ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదని, తనకు ఆ అవసరం లేదని….. తాను బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డట్లుగా వారు చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే ఏ శిక్షకు అయినా సిద్దం అని, వారు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని మూర్తి డిమాండ్ చేస్తున్నాడు. గతంలో తన ప్రవర్తన, తప్పుడు అంచనాలను బయటపెట్టినందుకే ఇప్పుడు తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మూర్తి అన్నారు.