రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్షం ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము ఆదివారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంభాషించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌పై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా తనకు మద్దతు ప్రకటించిన జగన్‌కు ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ తన మద్దతును ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముర్ము నామినేషన్ పత్రాలపై వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు సంతకాలు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement