Saturday, January 4, 2025

Lucknow : త‌ల్లి, నలుగురు చెల్లెళ్లు హ‌త్య.. లక్నో హోటల్ లో ఘాతుకం

కన్న తల్లి, సొంత చెల్లెళ్లని కనికరం లేకుండా ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదం సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్నోలోని హోటల్ గదిలో తల్లి, నలుగురు చెల్లెళ్లను 24 ఏళ్ల యువకుడి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు.నిందితుడిని ఆగ్రాకు చెందిన అర్షద్‌గా గుర్తించామని లఖ్‌నవూ సెంట్రల్ డీసీపీ రవీనా త్యాగి తెలిపారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగానే కుటుంబాన్ని హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు డీసీపీ సెంట్రల్ రవినా త్యాగి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement