Wednesday, November 20, 2024

దారుణం..నవవధువు, ఆమె తల్లి దారుణ హత్య…

కర్నూల్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఇద్దరు మహిళలు దారుణ హత్య గురయ్యారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లూరు ఎస్టేట్లో ఈ దారుణం చోటు చేసుకోగా, హత్యకు గురైన వారిలో నవ వధువుతో పాటు ఆమె తల్లి ఉంది. కర్నూల్ నగరంలోని కల్లూరులో రమాదేవి, వెంకటేశ్వర్లు దంపతులు అద్దెనివాసంలో ఉంటున్నారు. వీరికి రుక్మిణి (20) అనే కుమార్తె ఉంది. 14 రోజుల క్రితం కుమార్తెకు అదే కాలనీలోని చింత ల ముని నగర్ కు చెందిన శ్రావణ్ శెట్టి తో వివాహం జరిగింది. అయితే కుటుంబ కలహాల కారణంగా రుక్మిణి తో పాటు ఆమె తల్లి రమాదేవి, మామ వెంకటేశ్వర్లు ను శ్రావణ్ కుమార్, అతని తండ్రి కత్తులతో పొడిచి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.


ఈ ఘటనలో గాయపడిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాస్తవంగా ఈనెల 1వ తేదీన శ్రావణ్ కుమార్, రుక్మిణికి వివాహం జరిగినట్లు సమాచారం. అయితే వివాహం జరిగి పట్టుమని 14 రోజులోగే భార్య
రుక్మిణితో పాటు అత్త రమాదేవిని శ్రావణ్ శెట్టి, తన తండ్రి ప్రసాద్ శెట్టితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేయడం గమనార్హం. కూరగాయలు కోసే కత్తులతో వీరిని పొడిచి హత్య చేశారు. అలాగే రుక్మిణి తండ్రి వెంకటేశ్వర్లను దారుణంగా పోవడంతో ఆయన గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు రుక్మిణి (20) రమాదేవి ( 45) సంవత్సరాలు వీరిది స్వగ్రామం తెలంగాణలోని వనపర్తి జిల్లా. గాయాలైన వెంకటేశ్వర్లు కూడా వనపర్తి. శ్రావణ్ కుమార్ కు రుక్మిణికి మార్చి 1వ తేదీన వనపర్తి లో పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత రెండు రోజులకు శ్రావణ్ కుమార్ కు ఏదో ఇన్ఫెక్షన్ అని హైదరాబాదులోని ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించినట్లు శ్రావణ్ కుమార్ తండ్రి ప్రసాద్ శెట్టి తెలిపారు. అయితే ఏమి జరిగిందో లేదో తెలియదు కానీ మంగళవారం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు హైదరాబాదు నుండి శ్రావణ్ కుమార్ ను తండ్రి ప్రసాదు, అత్తమామలు భార్య కర్నూలుకు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన కేవలం 20 నిమిషాల లోపే ఇంట్లో గొడవపడి తల్లి, కూతుర్లను హత్య చేశారు.అలాగే రుక్మిణి తండ్రి వెంకటేశ్వర్లు కూడా తీవ్ర కత్తిపోట్లు గురి కావడంతో ఆయనను పోలీసులు 108 ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిపారు. కర్నూల్ డిఎస్పి మహేష్ ,ఫోర్త్ టౌన్ సీఐ శివ శంకరయ్య, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐలు ఎస్సైలు సంఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement