Monday, November 18, 2024

TG | పొంచిఉన్న మున్నేరు ముప్పు.. ఖమ్మం జిల్లాకు డిప్యూటీ సీఎం..

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకు బయల్దేరి వెళ్లారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలో మున్నేరు వాగు పొంగి ప్రవహించే అవకాశం ఉండడంతో వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చ‌రించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచిస్తూ భట్టి విక్రమార్క ఖమ్మం బయలుదేరి వెళ్లారు.

ఇక‌ జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో మున్నేరు వాగుకి మ‌రోసారి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని… ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారుల అందరిని అప్రమత్తం చేశారు. వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement