అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 వేల మంది టీచర్లు పుట్టెడు కష్టాల్లో మునిగితేలుతున్నారు. పురపాలక టీచర్లను ప్రభుత్వ టీచర్లులగా సమానంగా సదుపాయలు కల్పిస్తామని జీవో నెంబర్ 84 ఇచ్చి ఎనిమిది నెలలు దాటినప్పటికీ పురోగతి లేకపోగా మరికొన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా అయిపోయింది పురపాలక టీచర్ల పరిస్థితి. పురపాలక టీచర్లకు వార్షిక ఇంక్రిిమెంట్లు, 6,12,18,24 సంవత్సరాల ఇంక్రిమెం ట్లు జారీ చేయడం లేదు. పురపాకల టీచర్ల ఎస్‌ఆర్‌లో ఏదీ నమోదు కావడం లేదు. జీతాలు పురపాలక కమిషనర్ ఇస్తుండగా సెవా పుస్తకాలు ఎఇవో ఆఫీసులో ఉన్నాయి. పురపాలక టీచర్ల బదిలీలపై పాఠశాల విద్యా శాఖ గానీ, ప్రభుత్వం గానీ ఉలుకుపలుకు లేదు. కాగా పురపాలక టీచర్ల పదోన్నతులు అటకెక్కాయి. పురపాలక పాఠశాలల్లోని ఖాళీ స్థానాల్లో జెడ్పి టీచర్లను నింపడంతో ఈ సమస్య తలెత్తింది.
సమగ్ర శిక్షలోని సెక్టోరల్ ఆఫీసర్స్ పోస్టులకు మున్సిపల్ టీచర్లకు అవకాశం ఇవ్వడం లేదు. విదేశాలకు వెళ్లే పురపాలక టీచర్లకు పర్మిషన్ దొరకడం చాలా కష్టంగా ఉంది. పురపాలక టీచర్ల మెడికల్ బిల్లు ఎవరు డ్రా చేయాలో అర్ధం కావడం లేదు. పురపాలక హెడ్ మాస్టర్స్‌కు డీడీవో పవ ర్స్ ఇచ్చినప్పటికీ వాటి అమలు తీరు బాగోలేదు. ఆకస్మిక పర్యవేక్షణ పేరుతో అధికారుల చేస్తున్న హడావిడికి పురపాలక టీచర్లు పరుగులు పెట్టాల్సి వస్తోంది. వేల సంఖ్యలో ఉన్న అవుట్ సోర్స్డ్, పార్ట్ టైమ్ పురపాలక నాన్ టీచింగ్ స్టాఫ్‌ను వెనకి తీసుకోవడంతో ప్రధానోపాధ్యాయుడే అటెండర్ ఉద్యోగం చేయాల్సి వస్తోంది.
టీచర్లే కంప్యూటర్ వర్క్, స్కూల్ బెల్ కొట్టాల్సి వస్తోంది. పురపాలక పాఠశాలల్లో వేలల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను ఎవరు తీరుస్తారో అర్ధం కావడం లేదు. మంచినీరు సరఫరా, మరుగు దోడ్లు నిర్వహణ కూడా కష్టంగా మారింది. వీటి గురించి పాఠశాల విద్యా శాఖ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జీవో 84 జారీ తర్వాత పురపాలక టీచర్ల బతుకులు బాగుపడకపోగా మరింత కష్టాల్లో పడ్డారని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రామకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు.