మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఇవ్వాల జరిగిన మ్యాచ్‌లో ముంబై మహిళల జట్టు గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్లేఆఫ్‌లోకి దూసుకెళ్లింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 95 పరుగులు నాటౌట్) చెలరేగింది. ఓపెనెర్ యస్తిక భాటియా 49 పరుగులో ఆకట్టుకుంది. ఇక గుజరాత్ బౌలర్లలో ఆష్లీగ్ గార్డనర్, తనూజా కన్వర్, షబ్నమ్ ఎండి షకీల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ గుజరాత్ జట్టుకు ఓటమి తప్పలేదు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ బెత్ మూనీ (66), దయాళన్ హేమలత (74) తో చలరేగారు. భారతి ఫుల్మాలి (13 బంతుల్లో 21 పరుగులు నాటౌట్) ఆకట్టుకుంది. దీంతో గుజరాత్ స్కోరు భారీగా నమోదైంది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ 2 వికెట్లు తీయగా.. హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, షబ్నిమ్ ఇస్మాయిల్, పూజా వస్త్రాకర్, సజీవన్ సజన చెరో వికెట్ సాధించారు.