ఐపీఎల్ 2022లో నేడు ప్లేఆఫ్ కి ముందు జరిగే చివరి లీగ్ మ్యాచ్.. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ కు జిరిగే ఈ పొరులో ఈ మ్యాచ్ డిల్లీ క్యాపిటల్స్ కు కీలకంగా మారింది. అయితే టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఢిల్లీ ఓడితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్టే ఆఫ్స్ లో అడుగుపెడుతుంది. అందుకే ఈ మ్యాచ్ లో ముంబయి జట్టు గెలవాలని బెంగళూరు కోరుకుంటోంది.
ప్లే ఆఫ్స్ కు ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. మిగిలిన ఒక్క బెర్తు కోసం ఢిల్లీ, బెంగళూరు మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం బెంగళూరు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ 14 పాయింట్లతో ఐదొ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఢిల్లీకి కూడా 16 పాయింట్లు వస్తాయి. అప్పుడు రన్ రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం బెంగళూరు రన్ రేట్ (-0.253) మైనస్ లో ఉండగా, ఢిల్లీ రన్ రేట్ ( 0.255) ప్లస్ లో ఉంది.
ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు. లలిత్ స్థానంలో పృథ్వీ షా జట్టులోకి వచ్చాడని వివరించాడు. అటు, ముంబయి జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. స్టబ్స్ స్థానంలో డివాల్డ్ బ్రెవిస్ జట్టులోకి రాగా, సంజయ్ స్థానంలో షోకీన్ ను తీసుకున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.
మొదట బ్యాటింగ్ వచ్చిన ఢిల్లీ బ్యాట్స్ మెన్స్ లో వార్నర్ 6 బంతుల్లో 5 రన్లు చేసి అవుట్ అయ్యిడు.. తదుపరి గ్రీస్ లోకి వచ్చిన మిచల్ మార్శ్ బూమ్రా బౌలింగ్ లో డక్ అవుట్ అయ్యడు.. బూమ్రా బౌలింగ్ లోనే ప్రుత్వి షా కూడా 23 బంతుల్లో 24 రన్లు చేసి పెవిలియన్ చేరాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..