భారత్‌లో సోమాలియా తరహా దాడులు చేస్తామని ముంబై పోలీసులకు గత వారం రోజుల క్రితం వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ ముంబై ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ వాట్సాప్‌కు ఆగస్టు 19న శుక్రవారం అంతర్జాతీయ నంబర్ నుంచి వచ్చింది. భారత్ జాగ్రత్తగా ఉండండి సోమాలియా తరహా దాడులకు దూరంగా ఉండండి అటూ హెచ్చరించింది. 26/11 తరహా దాడులు ఉంటాయని మెసేజ్‌లో పేర్కొంది.
ఈ మెసేజ్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌కు రాత్రి 11.35కు చేరింది. 2008, నవంబర్ 11 తరహా దాడులు ఉంటాయని రాశారు. ఈ బెదిరింపు మెసేజ్ పాకిస్థాన్ ఫోన్ నెంబర్ నుంచి వచ్చినట్లు.. ఈ ప్లాన్‌ను భారత్‌లోని ఆరుగురు వ్యక్తులు అమలు చేస్తారని ఉంది. అయితే ఈ నెంబర్‌ను వెతకగా ఇది పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు తేలింది. అప్పటి నుంచి నేటి వరకు ఎలాంటి హెచ్చరికలకు సంబంధించిన మరో వార్త రాలేదు. సౌతాఫ్రికాలోని సోమాలియ ఘటన ఎక్కడ అన్నది స్పష్టంగా తెలియరాలేదు.