ముంబై – మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు తెలిపారు. ఛత్రపతి మహారాజ్‌ను తమ దైవంగా భావించే వారు ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యారని, వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. దైవం కంటే ఏదీ గొప్పది లేదని తెలిపారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా మాల్వాన్‌లో శుక్రవారం పర్యటించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, క్షమాపణలు చెప్పే నైజం విపక్షాలకు లేకున్నా తాను మాత్రం శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై క్షమాపణలు తెలియజేస్తున్నానని అన్నారు.
- Advertisement -