Friday, November 22, 2024

Mumbai – జాబ్ మేళాలో తొక్కిస‌లాట‌ … ప‌లువురికి గాయాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – ముంబ‌యి …. గుజరాత్ రాష్ట్రంలోని భారుచ్ జిల్లా అంకాళేశ్వర్ సిటీలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలిరావడంతో జ‌రిగిన తొక్కిసలాట విషయం మరవక ముందే ఇప్పుడు అలాంటి ఘటన ముంబైలో చోటు చేసుకుంది.. ఎయిర్‌ ఇండియా రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌కు పెద్ద ఎత్తున నిరుద్యోగుల రావడంతో అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది..

ఎయిర్‌పోర్ట్ లోడర్ల కోసం ఎయిర్ ఇండియా వాకిన్ ఇంటర్వ్యూ నిర్వ‌హించింది.. మొత్తం 2 వేలకు పైగా పోస్టుల కోసం జరిగిన వాకిన్‌కు దాదాపు 25 వేల మందికి పైగా నిరుద్యోగులు తరలివచ్చారు.. దీంతో ఎయిర్‌పోర్టు వద్ద పరిస్థితి అదుపు తప్పింది… యువకుల మధ్య తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది.. దీంతో అనేక మంది గాయ‌ప‌డ్డారు. 2,216 ఖాళీల కోసం 25వేల కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు వచ్చాయి. వారంతా ఒక్క‌సారిగా ఇంట‌ర్వ్యూకు త‌ర‌లిరావ‌డంతో నియంత్రించడం ఎయిర్ ఇండియా సిబ్బందికి కష్టంగా మారిపోయింది.. ఫారమ్ కౌంటర్‌లను చేరుకోవడానికి దరఖాస్తుదారులు ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు.. అంతేకాదు.. దరఖాస్తుదారులు.. ఆహారం.. మంచినీళ్లు కూడా లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. ప‌లువురు సృహ త‌ప్పిప‌డిపోయారు . దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement