Saturday, November 23, 2024

ఆక్సిజన్ స‌మ‌స్య‌ను సుమోటోగా స్వీక‌రించిన కోర్టు..

మహారాష్ట్రలో ఆక్సిజ‌న్‌, రెమ్‌డెసివిర్ కొర‌త‌ను బాంబే హైకోర్టు, ఔరంగాబాద్ ధ‌ర్మాస‌నం సుమోటోగా స్వీక‌రించింది. సుమోటోగా దాఖ‌లు చేసిన పిల్‌పై సోమ‌వారం విచార‌ణ జ‌రిపింది. దీనిపై ఈ నెల 29లోగా స్పందించాల‌ని ఔరంగాబాద్ బెంచ్ ప‌రిధిలోని అధికారులైన ఔరంగాబాద్ డివిజ‌న‌క‌ల్ క‌మిష‌న‌ర్‌, ఔరంగాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌, ఎస్పీలు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, జిల్లా క‌లెక్ట‌ర్ల‌తోపాటు మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శిని ఆదేశించింది. క‌రోనా సంబంధిత స‌మ‌స్య‌ల‌తోపాటు వ్యాక్సిన్ల కొర‌త‌పైనా కోర్టు ఆరా తీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement