Friday, November 22, 2024

వాంఖడే స్టేడియానికి హంగులు..

వన్డే ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ వాంఖడే స్టేడియానికి కొత్త ప్లడ్‌లైట్స్‌ను ఏర్పాటు చేస్తున్నది. అదేవిధంగా అతిథుల కోసం బాక్సులను కూడా కొత్తగా అమర్చుతోంది. ప్రపంచ కప్‌ కోసం బీసీసీఐ దేశవ్యాప్తంగా ఐదు స్టేడియాలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. భారత్‌ ఆడే ఒక మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్‌ ఇక్కడ జరగనుంది.

వాంఖడేలో వసతుల కల్పన కోసం ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ బిడ్లను ఆహ్వానించింది. ఇంకా టెండర్ల వివరాలను వెల్లడించలేదు.”ఎల్‌ఈడీ ప్లnడ్‌లైట్‌ సిస్టమ్‌, డీఎంఎక్స్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ కోసం సీల్‌ టెండర్లను ఆహ్వానించాం. సంబంధించిన వివరాలన్నీ టెండర్‌ డాక్యుమెంట్‌లో ఇచ్చాం” అని ఎంసీఏ తెలిపింది. హాస్పిటాలిటీ బాక్సులను రినోవేషన్‌ చేయడానికి కూడా దరఖాస్తులను ఆహ్వానించినట్లు పేర్కొంది. జూన్‌ 30న జరిగే ఎంసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ తర్వాత పూర్తి వివరాలను వెల్లడించనుంది. చెపాక్‌ స్టేడియంలోని పిచ్‌లను మార్చే పనులను అక్కడి క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement