మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ముంబై స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రౌత్‌తోపాటు ప్రవీణ్ రౌత్‌కు కూడా బెయిల్ ఇచ్చింది. దాంతో ఆయన మూడు నెలల తర్వాత బయటకు వచ్చారు. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలన్న ఈడీ అభ్యర్థనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ముకుళిత హస్తాలతో న్యాయమూర్తికి రౌత్ నమస్కరించారు. సంజయ్ రౌత్‌కి బెయిల్ లభించడం పట్ల ఆయన సోదరుడు స్పందించారు. ఇది మాకు ఎంతో సంతోషకరమైన రోజు. మా కుటుంబానికి పండుగరోజు. మేము కోర్టును నమ్మాం అని సందీప్ రౌత్ వ్యాఖ్యానించారు.
పాత్రా చావల్ ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించి వందకోట్ల మేరకు ఎంపీ సంజయ్ రౌత్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడంటూ ఈడీ కేసు నమోదు చేసింది. ఆగస్టు 1న రౌత్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తొలుత కస్టడీలోకి తీసుకోగా, ఆ తర్వాత న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది.