దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(2020-21) సీజన్ విజేతగా ముంబై జట్టు నిలిచింది. దీంతో ముంబై టీమ్ నాలుగోసారి హజారే ట్రోఫీని గెలుచుకున్నట్లయింది. యువ ఓపెనర్ పృథ్వీ షా నాయకత్వంలోని ముంబై జట్టు ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన ఫైనల్ పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పృథ్వీ షా( 39 బంతుల్లో 73) 10ఫోర్లు, 4సిక్సర్లతో మెరుపు ఆరంభానికి తోడు ఆదిత్య తారే(107 బంతుల్లో 118 నాటౌట్) 18ఫోర్లు సహాయంతో శతకం బాదడంతో 313 పరుగుల లక్ష్యాన్ని ముంబై 41.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శివమ్ దూబే(42), శామ్స్ ములానీ(36) ఆకట్టుకున్నారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన యూపీ 50 ఓవర్లలో 4 వికెట్లకు 312 పరుగులు చేసింది. మాదవ్ కౌశిక్(156 బంతుల్లో 158 నాటౌట్) 15 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో అజేయ శతకంతో విజృంభించాడు. సమర్థ్ సింగ్(55), అక్షదీప్ నాథ్(55) అర్ధసెంచరీలతో రాణించారు. ఈ సీజన్‌లో పృథ్వీ షా బ్యాటింగ్ హైలెట్‌గా నిలిచింది. టోర్నీలో ఇప్పటి వరకు పృథ్వీ ఏకంగా నాలుగు శతకాలు బాదడం విశేషం.
Advertisement
తాజా వార్తలు
Advertisement