Monday, November 25, 2024

Mumbai : ఆసియా బిలియ‌నీర్ క్యాపిట‌ల్ గా ముంబ‌యి

ఆసియా బిలియనీర్ క్యాపిటల్‌గా తొలిసారి భారత ఆర్థిక రాజధాని ముంబై నిలిచింది. ముంబైలో మొత్తం 92 మంది బిలియనీర్లు మాత్రమే ఉండగా.. ఈ సంఖ్య బీజింగ్‌లో 91గా ఉంది. ఈ మేరకు తాజాగా, హురూన్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్ ఈ జాబితాను రిలీజ్ చేసింది.

- Advertisement -

అయితే, హురూన్ లిస్ట్ ప్రకారం.. ఓవరాల్‌గా చూసినట్లయితే చైనాలో మొత్తం 814 మంది బిలియనీర్లు ఉన్నారు. భారత్‌లో కేవలం 271 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అత్యధిక బిలియనీర్లు కలిగిన జాబితాలో న్యూయార్క్ 119 మంది బిలియనీర్లతో తొలి స్థానంలో నిలిచింది. 97 మంది బిలియనీర్లతో లండన్ రెండో స్థానంలో నిలిచింది. ఇక, ముంబై ఈ లిస్టులో 92 మంది బిలియనీర్లతో థర్డ్ ప్లేస్ లో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement