Friday, November 22, 2024

సింగరేణి ఉద్యోగులు, స్థానిక ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు.. ఖ‌ర్చుకు వెన‌కాడ‌బోమ‌న్న సంస్థ‌

సింగరేణి సంస్థ తమ‌ ఉద్యోగుల కోసం ఖర్చుకు వెనకాడకుండా నాణ్యమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తోందని, అలాగే సింగరేణి ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లో కూడా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాలను నిర్వహిస్తుందని సింగరేణి సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్, పర్సనల్ ఎన్. బలరాం అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ ఉద్యోగులు, అధికారులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కోసం సింగరేణి వైద్యశాఖ ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని సందర్శించి ఆయ‌న మాట్లాడారు. జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం. సురేష్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ సింగరేణి ప్రాంతానికి దూరంగా ఉండటం వల్ల ఇక్కడి ఉద్యోగుల సౌకర్యం కోసం ఇటువంటి ప్రత్యేక వైద్య శిబిరాలను గతంలో అనేకసార్లు నిర్వహించామని, ఇకపై కూడా అవసరమైన క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ఎం. సురేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్.వి. రాజశేఖర రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్. భాస్కర్ తదితరులు ప్రసంగించారు.

డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె. బాలకోటయ్య సారథ్యంలో ‘‘డాక్టర్. మోహన్స్ డయాబెటిక్ స్పెషాలిటీస్, మ్యాక్సీ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్లోవ్ డెంటల్ హాస్పిటల్స్’’కు చెందిన వైద్యులు, వైద్య సిబ్బంది సహకారంతో మెడికల్ క్యాంపు నిర్వహించగా.. సింగరేణి భవన్లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సహాయ సిబ్బందికి ఈ క్యాంపులో ఉచితవైద్య పరీక్షలు, స్పెషలిస్టు డాక్టర్లతో కన్సల్టేషన్నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి తదుపరి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల కోసం వైద్య నిపుణులు సిఫార్సు చేశారు. ఈ క్యాంపు నిర్వాహణలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. పూర్ణచందర్రావు, వైద్యశాఖ నుంచి వరాల సత్యనారాయణ, శ్రీధర్ సహకరించారు. తమకోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించడంపై సింగరేణి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement