సోమాజిగూడ, (ప్రభన్యూస్) : ప్రతిభావంతులను ప్రోత్సాహించే పోటీలకు సంబంధించిన పోస్టరును సోమాజిగూడ లోని పార్క్ హోటల్ లో ముల్తాయ్ స్టూడియో ఎంబిసి సీజన్ 4 పేరుతో ఆవిష్కరించింది. (ఫ్యాషన్ డిజైనర్ షోలు), ఎస్ బి ఎం ఎస్ సీజన్ 4 (బ్రైడల్ మేకప్ కాంపిటీషన్) , ఎఫ్ డి ఎఫ్ సి సీజన్ 1 (నేషన్ వైడ్ ఫ్యాషన్ డిజైనర్ కాంపిటీషన్) , ఎస్ ఐ ఎం ఏ సీజన్ 1 (నేషన్ వైడ్ బ్యూటీ ఎక్స్‌పో) వంటి వివిధ పోటీ-లను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం ముఖ్య అతిథిగా హజరై పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మొత్తం నాలుగు అంశాలకు సంబంధించిన పోటీలు జులై 24న వరంగల్‌లో జరుగనున్నాయని అన్నా రు.
ఆసక్తి గలవారు 9553161333 , 7995514547 నంబర్‌లను సంప్రదిం చడం ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్ట ర్ వకుళాభరణం కృష్ణమోహనరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా బాగుందని, మేకప్, ఫ్యాషన్, బ్యూటీ, ఫ్యాషన్ రంగాల్లో తమదైన ముద్ర వేయాలనుకునే యువతరానికి మంచి అవకాశం అని అన్నారు. ముంబై మరియు బెంగళూరు వంటి పెద్ద నగరాలతో సమానంగా మనం ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రొఫెసర్ రేఖా రావు మాట్లాడుతూ అందం మరియు అలంకరణ వ్యవస్థీకృత ఆస్తి కాదు. ఇప్పుడు యువత కెరీర్‌లో రాణించడానికి ఇటు వంటి ఈవెంట్‌లు నిజంగా సహాయపడతాయన్నారు. రాబోయే ప్రతిభను ప్రోత్సహిస్తున్నందుకు మోక్ష్‌ను నేను నిజంగా అభినందిస్తున్నానని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.