సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యానికి గురై ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ములాయం ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారని తెలిపారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు కేసీఆర్ ఫోన్ చేశారని పేర్కొన్నారు. ఆస్పత్రి పాలైన ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించినట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
- Advertisement -