Friday, November 22, 2024

భారత నూతన అటార్నీ జనరల్‌గా ముకుల్‌ రోహత్గి

సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి భారత సుప్రీంకోర్టు అటార్నీ జనరల్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కేకే వేణుగోపాల్‌ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. 2014 నుంచి 2017 వరకు అప్పటి ఎన్డీయే ప్రభుత్వ హాయంలో రోహత్గి అటార్నీ జనరల్‌గా పనిచేశారు. వ్యక్తిగత కారణాల వల్ల అప్పట్లో పదవి నుంచి తప్పుకున్న రోహత్గి తన సొంత ప్రాక్టీసును ప్రారంభించారు. అప్పటి నుంచి కేకే వేణుగోపాల్‌ భారత అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు.

అయితే వయసు పెరగడంతో కేకే వేణుగోపాల్‌ కొనసాగలేనంటూ కేంద్రానికి విన్నవించుకున్నారు. అయితే అభ్యర్థనను విన్న కేంద్రం నూతనంగా మరొకరిని నియమించే వరకు ఉండాలని పదవీ కాలాన్ని పొడగిస్తూ వచ్చింది. సెప్టెంబర్‌ 30న కేకే వేణుగోపాల్‌ పదవీ విరమణ చెందిన అనంతరం అక్టోబర్‌ 1న ముకుల్‌ రోహత్గిd రెండవ సారి భారత అత్యున్నత న్యాయస్థానంలో అటార్నీ జనరల్‌గా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement