Sunday, October 20, 2024

Wajedu – వాగులు, గుట్టలు దాటి అడవి బిడ్డలకు వైద్యం – డి ఎం హెచ్ ఓ అప్పయ్యకు ప్రశంసలు

వాజేడు జూలై 17 ప్రభ న్యూస్ : అరణ్యంలో ఒక గ్రామం దాని పేరే పెనుగోలు అది ఉంది ములుగు జిల్లా వాజేడు మండలంలో మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది ఆ గ్రామం వెళ్లాలంటే రెండు గుట్టలు మూడు వాగులు దాటాల్సిందే 16 కిలోమీటర్లు కాలినడకల వెళ్లాల్సిన పరిస్థితి ఆ గ్రామానికి రోడ్డు మార్గం రవాణా సౌకర్యం లేదు కాలిబాటన నడిచి వెళ్తేనే ఆ గ్రామం చేరుకుంటారు అలాంటి గ్రామాన్ని సందర్శించారు ములుగు జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య .

వాజేడు మండల కేంద్రంలోని వైద్యశాలను తనిఖీ చేసిన ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై నివసిస్తున్న గిరిజన గ్రామాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఆయన వెంట వాజేడు వైద్య అధికారి కొమరం మధుకర్ పెనుగోలు హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేష్ ఆశా వర్కర్ సమ్మక్కలతో కలిసి వెళ్లారు 16 కిలోమీటర్లు కాలిబాటన నడిచి రెండు గుట్టలు మూడు వాగులు దాటుతూ అష్ట కష్టాలు పడుతూ ఆ గ్రామానికి చేరుకున్న జిల్లా వైద్య అధికారి అప్పయ్య రాత్రి ఆ గ్రామంలో బస చేసి అక్కడి గిరిజనుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు

- Advertisement -

గ్రామంలోని ప్రతి ఇల్లును సందర్శించి డెంగు మలేరియా వ్యాధులు సంభవించకుండా దోమల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. జ్వరాలు సంభవించినప్పుడు. తీసుకోవాల్సిన తగ్గు జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు వర్షాకాల సీజన్ కనుక విషపురుగుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన అక్కడ ప్రజలతోమాట్లాడుతూ తెలిపారు. జ్వరం సంభవించిన వెంటనే పారాసెట్ మిల్ టాబ్లెట్లు వేసుకోవాలనితెలిపారు.

ఇది ఒక సాహసమే :

సాధారణ సమయంలోనే పెనుగోలు గ్రామం వెళ్లాలంటే సాహసించలేని అధికారులు వర్షాకాల సీజన్లో రెండు గుట్టలు మూడు వాగులు దాటుతూ పీకల లోతు నీటిలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పెనుగోలు గ్రామం చేరుకొని ఓ జిల్లా వైద్యాధికారి అక్కడి గిరిజనులకు వైద్య సేవలు అందించడం ఓ సాహసంమే నని పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాలిబాటన 16 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గిరిజనులకు వైద్యం అందించడం సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం పట్ల ఆ అధికారి సేవలు బేష్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు గిరిజన కుటుంబంలో పుట్టారు గనకే గిరిజనులు పడే కష్టాలు ఆయనకు తెలిసి ఉంటాయి అందుకే ఆయన ఇంతటి సాహసం చేశారు అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

కీటక జననిత వ్యాధులపై అవగాహన : కీటక జననిత వ్యాధులపై పెనుగోలు గిరిజనులకు ములుగు జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అవగాహన కల్పించడం జరిగింది. సీజనల్ వ్యాధులు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిసరాల పరిశుభ్రత దోమతెరల వాడకం గురించి వివరించారు అదేవిధంగా 11 కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఉయిక మల్లయ్య బొగ్గుల లింగయ్య ఇద్దరు వ్యక్తులకు మలేరియా పాజిటివ్ రావడంతో వారికి ట్రీట్మెంట్ అందించి మలేరియా ఫస్ట్ డోస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కంటిన్యూ చేయమని వివరించడం జరిగింది. పెనుగోలు గ్రామాన్ని సందర్శించినములుగు జిల్లా వైద్యాధికారి11 కుటుంబాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement