Monday, November 18, 2024

ముఖేశ్ అంబానీ పారితోషికం ‘‘శూన్యం’’

రిలయన్స్ సంస్థ తాజా వార్షిక నివేదికలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంబానీ పారితోషికం ‘‘శూన్యం’’ అని పేర్కొంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.15 కోట్లు జీతం పొందారు. పదకొండేళ్ళ నుంచి ఆయన ఇదే విధంగా జీతం తీసుకుంటున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయన తన జీతం, పరిలబ్ధులు, భత్యాలు, కమిషన్ కలిపి రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. సంవత్సరానికి దాదాపు రూ.24 కోట్లకు పైగా ఆయన వదులుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఏడాది జూన్‌లో విడుదల చేసిన ప్రకటనలో, భారత దేశంలో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం సమాజం, ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగాలపై తీవ్రంగా పడినందువల్ల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ డి అంబానీ తన జీతాన్ని వదులుకోవాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 

రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పీఎంఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్ పారితోషికాలు పెరిగాయి. వారు రెండేళ్ళలో తమ పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను పొందారు. ప్రసాద్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.11.99 కోట్లు పొందారు. అంతకుముందు సంవత్సరం ఆయన రూ.11.15 కోట్లు పొందారు. కపిల్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4.24 కోట్లు పొందారు. అంతకుముందు ఏడాది ఆయనకు రూ.4.04 కోట్లు లభించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement