Friday, September 20, 2024

Muhurtham Fix – రేపు నాగార్జున‌సాగ‌ర్ నుంచి నీరు విడుద‌ల

కోమ‌టిరెడ్డి,తుమ్మ‌ల‌, పొంగులేటిలు సాగ‌ర్ కు ప‌య‌నం
ప్ర‌స్తుతం సాగ‌ర్ నీటిమ‌ట్టం 532.5 అడుగులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – నాగార్జున సాగ‌ర్ – తెలంగాణలో పలు నీటి ప్రాజెక్టులకు ఎగువ నుంచి భారీ వరద పోటెత్తుతోంది. ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడంతో నాగార్జునసాగర్కు వరద ప్రవాహం ఉద్ధృతంగా సాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, బి.లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు..మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు.

- Advertisement -

మరోవైపు ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయానికి 2లక్షల 82వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. నాగార్జున సాగర్‌ లో 172.87 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. నాగార్జునసాగర్ ప్రస్తుతం నీటిమట్టం 532.5 అడుగులకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement