టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు లక్షమందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే హసీన్ జహాన్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వివాదంగా మారింది. రగ్గడ్ జీన్స్, బ్లాక్ టాప్‌తో ఉన్న ఫొటోను హసీన్ జహాన్ పోస్ట్ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ఫొటో కాస్తంత బోల్డ్‌గా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వివాహమై ఓ బిడ్డకు తల్లివి కూడా అయిన తర్వాత కూడా ఇంత బోల్డ్‌గా కనిపించడం అంత అవసరమా? అంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. మరికొందరేమో బ్యూటిఫుల్ లుక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 7 ఏప్రిల్ 2014న వివాహం చేసుకున్న షమీ, హసీన్‌ల కాపురంలో ఆ తర్వాత కలతలు రేగాయి. ప్రస్తుతం వీరు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, విడాకులు మాత్రం తీసుకోలేదు. షమీకి మరో మహిళతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని హాసన్ ఆరోపించినప్పటికీ నిరూపించలేకపోయింది. కోల్‌కతాకు చెందిన హసీన్ మోడల్ కూడా.
ఇది కూడా చదవండి: t20 world cup: ఆస్ట్రేలియా జట్టు ఇదే..